News February 11, 2026

తిరుమల: లీవ్ పెట్టారా.. పెట్టించారా?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ.బాలాజీ ప్రమేయం ఉందని సిట్ తేల్చింది. చర్యలకు సిఫార్సు చేసింది. అయితే ఆయన సెలవుపై వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సెలవు పెట్టారని కొందరి వాదన. చర్యలు తీసుకునే ముందు ఆయనను సెలవు పెట్టించారనే ప్రచారం సైతం జరుగుతోంది. మరి ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి మరి.

Similar News

News February 16, 2026

ఖమ్మం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన

image

ప్రేమించి మోసం చేశారంటూ ఓ యువతి ఇంటి ముందు బైఠాయించిన ఘటన కూసుమంచి మండలం ముత్యాల గూడెం గ్రామంలో జరిగింది. బూర్గంపాడు మండలానికి చెందిన ఓ యువతి ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పగిళ్ల మనోజ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు నిరాకరించడంతో యువతి, కుటుంబ సభ్యులు మనోజ్ ఇంటిముందు బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News February 16, 2026

సంగారెడ్డి: పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో

image

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.

News February 16, 2026

సన్నాలకు బోనస్.. రూ.514.36 కోట్లు విడుదల

image

TG: సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ కోసం రూ.514.36 కోట్లు విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ఈ బోనస్ అదనంగా లభించనుంది.