News November 27, 2025

తిరుమల వెళ్లినప్పుడు దీన్ని తప్పక చూడండి

image

తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీకి ఎదురుగా తాళ్లపాక అర ఉంటుంది. దీన్నే సంకీర్తనా భాండాగారం అంటారు. 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యులు రోజుకో కీర్తన రచించేవారట. ఆయనతో పాటు ఆయన వంశీకులు రచించిన అసంఖ్యాకమైన సంకీర్తనలన్నీ ఈ అరలోనే భద్రపరిచారు. ఈ అర బయట ఉన్న శిలా ఫలకంపై అన్నమయ్య ఉన్న చిత్రం ఉంటుంది. ఈసారి తిరుమల వెళ్లినప్పుడు దీన్ని అస్సలు మిస్సవ్వకండి.<<-se>>#VINAROBHAGYAMU<<>>

Similar News

News November 27, 2025

మెదక్ జిల్లాలో మొదటి రోజు 55 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మొదటి రోజు 55 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అల్లాదుర్గంలో 5, రేగోడులో 6, పెద్ద శంకరంపేటలో 7, టేక్మాల్‌లో 5, పాపన్నపేటలో 13, హవెలిఘనాపూర్లో 16 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే వాడు మెంబర్ స్థానాలకు టేక్మాల్ మండలంలో ఒకటి, హవేలిఘనపూర్‌లో మూడు నామినేషన్ దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి ఎక్కువ సంఖ్యలో నామినేషన్ దాఖలు అయ్యే అవకాశం ఉంది.

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 పోస్టులు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.