News November 27, 2025
తిరుమల: సుబ్రహ్మణ్యానికి 10 వరకు రిమాండ్..!

తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టయిన టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం సుబ్రహ్మణ్యంకు నెల్లూరు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. గురువారం సాయంత్రం ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 10వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సుబ్రహ్మణ్యంను నెల్లూరు కోర్టు నుంచి జైలుకు తరలించారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.
Similar News
News November 28, 2025
అమలాపురం: 22 మందికి డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాలకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ కలెక్టర్ మహేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా సచివాలయ పరిపాలన పర్యవేక్షణకు ఈ నియామకాలు చేపట్టారు. గ్రామ పంచాయతీల్లోని సీనియర్ గ్రేడ్-1 కార్యదర్శులకు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి డిప్యూటీ ఎంపీడీవోలుగా అవకాశం కల్పించారు.
News November 28, 2025
నేడు కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న PDSU 23వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారు. PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్‌యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
News November 28, 2025
సూర్యాపేట వాసికి నేషనల్ ఫార్మా అవార్డు

సూర్యాపేట వాసి డా.అనంతుల రవి శేఖర్‌కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన ఫార్మా క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 వేడుకలో ఆయనకు నేషనల్ ఇండియా ఫార్మా అవార్డు వరించింది. శాస్త్రవేత్తగా చేసిన ప్రయోగాత్మక సేవలకు సీపీహెచ్ఐ ఆర్గనైజింగ్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని రవి శేఖర్ తెలిపారు.


