News December 27, 2025
తిరుమల: 29 నుంచి 8 వరకు టోకెన్లు ఉండవు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల నేపథ్యంలో TTD కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు తిరుపతిలో జారీ చేసి SSD టోకెన్లు డిసెంబర్ 29 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిలిపివేసింది. 28 ఆదివారం దర్శన టికెట్లు శనివారం ఉదయమే జారీ చేశారు. 29 సోమవారానికి ఇచ్చే టికెట్లు జారీ చేయరు. తిరిగి జనవరి 9వ తేదీకి సంబంధించిన టోకెన్లు 8వ తేదీ జారీ చేయనున్నారు.
Similar News
News December 27, 2025
గ్రేటర్ తిరుపతికి బ్రేకులు !

గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రస్తుతం అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదా ఇవ్వడంలో కొన్ని సాంకేతిక, చట్టపరమైన సమస్యలు ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. జనగణన అనంతరం గ్రేటర్ తిరుపతి అంశంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
News December 27, 2025
రూ.22 కోట్ల గంజాయిని తగలబెట్టాం: భద్రాద్రి ఎస్పీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాదిలో 70 కేసుల్లో మొత్తం 221 మందిని అరెస్టు చేయడంతో పాటు వీరి నుంచి కోట్ల విలువగల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇందులో 5,707 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సుమారుగా రూ.22 కోట్ల గంజాయిని ఈ ఏడాది తగులబెట్టడం జరిగిందని వార్షిక నివేదిక ద్వారా వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
News December 27, 2025
జిల్లాలో మహిళలపై తగ్గిన నేరాలు: ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి జిల్లాలో మహిళల భద్రతకు తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల వారిపై జరుగుతున్న నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మహిళలపై జరిగిన నేరాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా 420 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 384కి తగ్గిందని వివరించారు. అంటే మొత్తం మీద మహిళలపై నేరాలు 8.57 శాతం తగ్గాయని వెల్లడించారు.


