News January 5, 2026

తిరుమల: FEB 19 నుంచి విద్వత్ సదస్సు

image

తిరుమల ధర్మగిరి శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఫిబ్రవరి 19 నుంచి 24 వరకు శ్రీ వేంకటేశ్వర వేద-శాస్త్ర-ఆగమ-విద్వత్ సదస్సు జరగనుంది. ఇందులో వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు, పురాణాలు, ఇతిహాసాల తదితర వాటిపై మౌఖిక, లేఖన పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా 21న ప్రతివర్ష పండితులకు వార్షిక సభ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైన్నాయి.

Similar News

News January 6, 2026

USలో ఏటా రూ.63 లక్షల కోట్ల ఫ్రాడ్: మస్క్

image

US మిన్నెసోటాలో ‘<<18728357>>డే కేర్ సెంటర్ల<<>>’ పేరిట $100 బిలియన్ల వరకు ఫ్రాడ్ జరిగి ఉంటుందన్న వార్తలపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మిన్నెసోటా కంటే కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్‌లో జరుగుతున్న ఫ్రాడ్ చాలా పెద్దది. నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఏటా $700 బిలియన్స్(సుమారు రూ.63 లక్షల కోట్లు) స్కామ్ జరుగుతోంది’ అని ట్వీట్ చేశారు.

News January 6, 2026

ఆలివ్ రిడ్లీ తాబేళ్ల ‘ఇన్‌బిల్ట్ GPS’ సీక్రెట్!

image

ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పుట్టిన తీరానికే తిరిగొచ్చి గుడ్లు పెట్టడానికి ‘జియోమాగ్నెటిక్ ఇంప్రింటింగ్’ ప్రధాన కారణం. తీరానికి ఉండే ప్రత్యేక అయస్కాంత తీవ్రత, కోణాన్ని ఇవి పుట్టినప్పుడే మెదడులో నిక్షిప్తం చేసుకుంటాయి. ఈ ఇన్‌బిల్ట్ GPS సాయంతో వేల కి.మీ దూరం నుంచి గమ్యాన్ని గుర్తిస్తాయి. ఇసుక వాసన, నీటి రసాయన గుణాలు, ఖనిజాల సంకేతాలూ అందుకు సాయపడతాయి. అందుకే అవి కచ్చితంగా ఒడిశా, AP తీరానికి వస్తాయి.

News January 6, 2026

ఒమన్‌లో పెళ్లికి ముందు హెల్త్ చెకప్ తప్పనిసరి!

image

ఒమన్‌లో ఇకపై పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చింది. జంటలో ఒకరు విదేశీయులైనా ఈ టెస్టులు కంపల్సరీ. జన్యుపరమైన వ్యాధులను గుర్తించడం, హెపటైటిస్, HIV వంటి వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి లేదా పుట్టబోయే బిడ్డకు సోకకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. రిజల్ట్స్‌ను మూడో వ్యక్తికి చెప్పొద్దనే నియమం పెట్టారు.