News April 13, 2025
తిరుమల: PIC OF THE DAY

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి శ్రీవారి ఆనంద నిలయం చంద్రుని కాంతిలో మెరిసిపోయింది. పౌర్ణమి చంద్రుడు ఆలయ శిఖరంపై తన ప్రకాశాన్ని విరజిమ్ముతూ భక్తులను మంత్ర ముగ్ధులను చేశాడు. ‘ఓ చంద్రమా, నా ఆనంద నిలయం నుంచి ప్రపంచానికి చల్లటి నీడను ఇవ్వు’ అన్న భావనను నిజం చేస్తూ తిరుగిరులపై చంద్రుని చల్లని వెలుగు పరచుకుంది.
Similar News
News April 13, 2025
రేగొండ: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ (59) ఆదివారం ఉదయం ఇంటి వద్ద పనులు చేస్తూ కిటికీ ఊచలను పట్టుకుంది. ఇంట్లోకి వెళ్లే విద్యుత్ తీగలు కిటికికీ తాకడంతో కిటికీని పట్టుకున్న నీలమ్మకు షాక్ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఎగ్జామ్ ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చోటు చోసుకుంది. చింతారెడ్డిపాళెంకు చెందిన ఓ విద్యార్థి నగరంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం విడుదలైన ఫలితాలలో ఆ విద్యార్థి ఓ సబ్జెక్ట్ తప్పాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.