News December 26, 2025
తిరువూరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

తిరువూరు బైపాస్‌లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని బైక్ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు జల్ది కార్తీక్ (30) పట్టణంలోని ఒక మొబైల్ షాపులో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి దేవరపల్లి సాయికిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 26, 2025
NTR జిల్లాలో కొండెక్కిన కోడిగుడ్డు ధర..!

కోడిగుడ్డు ధర కొండెక్కిందని ప్రజలు అంటున్నారు. చందర్లపాడు తదితర మండలాలలో నేడు గుడ్డు ధర ఒక్కటి రూ.7.55కు చేరిందని స్థానికులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో భాగమైన గుడ్లు ధరలు పెరగడంతో కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు. మేత ధరలు, రవాణా వ్యయాలు పెరగడమే గుడ్డు ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వ్యాపారులు పేర్కొన్నారు. మరి మీ ప్రాంతంలో గుడ్డు ధర ఎంతో కామెంట్ చేయండి..!
News December 26, 2025
డిసెంబర్ 31నే పింఛన్ల పంపిణీ: అనంతపురం కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లాలోని 2,78,388 మందికి రూ.124.47 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 31న ఉదయం 6:30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేయాలని ఆదేశించారు. జనవరి 1న న్యూ ఇయర్ కావడంతో ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నారు.
News December 26, 2025
శిల్పాశెట్టి అసభ్యకర వీడియోలు.. వెంటనే తొలగించాలన్న కోర్టు

AI ఉపయోగించి తయారుచేసిన నటి శిల్పాశెట్టి డీప్‌ఫేక్ వీడియోల URLs, లింక్స్, పోస్టులను వెంటనే డిలీట్ చేయాలని సంబంధిత సైట్లను బాంబే HC ఆదేశించింది. ఆన్‌లైన్‌లో ఉన్న తన అసభ్యకర ఫొటోలు, వీడియోలను తొలగించాలని శిల్ప వేసిన పిటిషన్‌ను జస్టిస్ అద్వైత్ ఎం సేథ్నా వెకేషన్ బెంచ్ విచారించింది. ప్రాథమిక గోప్యత హక్కును ప్రభావితం చేసేలా ఒక వ్యక్తి/వ్యక్తిత్వాన్ని చిత్రీకరించకూడదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.


