News March 28, 2025

తిరువూరులో వేడెక్కుతున్న రాజకీయం

image

AMC మాజీ ఛైర్మన్ రమేశ్ రెడ్డికి స్థానిక ఎంపీ మద్దతు ఉందని ఎమ్మెల్యే కొలికపూడి నిన్న ఆరోపించారు. రమేశ్‌పై పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే తెలుపగా..రూ.2 కోట్లు అడిగితే తాను ఇవ్వకపోవడంతో కొలికపూడి తనపై నిందలు వేస్తున్నారని రమేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో తిరువూరులో MP Vs MLAగా వివాదం తీవ్రమవుతోంది. ఆరోపణలు చేసేవారు ఓపెన్ డిబేట్‌కి రావాలని MLA సవాల్ విసిరారు.

Similar News

News July 5, 2025

అంబేడ్కర్ కోనసీమ వైసీపీ జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైసీపీ కార్యదర్శిగా మామిడికుదురు(M) పాసర్లపూడికి చెందిన పిల్లి శ్రీనివాస్ ను నియమించారు. దీనికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ఆదేశాలు వెలువడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని శ్రీనివాస్ చెప్పారు.

News July 5, 2025

NTR: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్విరాన్‌మెంట్ స్పెషలిస్ట్ (2), ఎన్విరాన్‌మెంటలిస్ట్ (1), ప్రాజెక్టు ఇంజినీర్-సస్టైనబిలిటీ(1) పోస్టులను ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 18లోపు https://crda.ap.gov.in/లో దరఖాస్తు చేయాలన్నారు. వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలన్నారు.

News July 5, 2025

మామిడి సమస్యపై ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదు?

image

చిత్తూరు: మామిడి రైతుల సమస్య పొలిటికల్ టర్న్ తీసుకుందనే చెప్పాలి. వైసీపీ నాయకులు మామిడి మద్దతు ధర విషయమై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ 9న బంగారుపాళ్యంలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు మినహా మరే ఎమ్మెల్యేలు స్పందించకపోవడం గమనార్హం. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పందించినా వైసీపీ విమర్శలను తిప్పి కొట్టేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి.