News October 20, 2025
తిరువూరు గొడవలకు ఆ ఇద్దరి నేతల ఆధిపత్యమే కారణమా?

తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పదవుల కేటాయింపు, ఆర్థిక వనరుల విషయంలో ఇద్దరు తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం ముదురుతోందని టాక్. కొలికపూడి నేనే బాస్ అని భావిస్తుండగా, ఎంపీ చిన్ని తన వర్గానికి వాటా కావాలని పట్టుబడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిష్ఠానం జోక్యం చేసుకున్నా ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడంతో వివాదాలు కొనసాగుతున్నాయంట.
Similar News
News October 20, 2025
గాల్లో విమాన అద్దం ధ్వంసం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

డెన్వర్(US) నుంచి లాస్‌ఏంజెలిస్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం ఘోర ప్రమాదం తప్పించుకుంది. గాల్లో 36 వేల ఫీట్ల ఎత్తులో ఉన్న సమయంలో కాక్‌పిట్ విండ్‌షీల్డ్(అద్దం) పగిలిపోయి పైలట్‌కు గాయాలయ్యాయి. ఆయన వెంటనే అప్రమత్తమై ల్యాండ్ చేయడంతో 140 మంది ప్రయాణికులు, సిబ్బంది సేఫ్‌గా బయటపడ్డారు. పైలట్ చేతిపై కాలిన గాయాలు ఉండటంతో ఉల్క ఢీకొట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
News October 20, 2025
ESIC ఇండోర్‌లో 124 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ESIC ఇండోర్‌లో 124 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి MBBS/MD/MSతో పాటు పని అనుభవం గలవారు ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. వెబ్‌సైట్: https://esic.gov.in/recruitments
News October 20, 2025
18 నెలల్లో ఒక్క దీపమైనా వెలిగిందా: జగన్

AP: కూటమి ప్రభుత్వం ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో 18 నెలల్లో ఒక్కటైనా వెలిగిందా అని YS జగన్ ప్రశ్నించారు. ‘రూ.3వేల నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500, రైతులకు ఏడాదికి రూ.20,000, పిల్లలకు ఏటా రూ.15,000, ఇంటింటికీ ఏటా 3 ఉచిత సిలిండర్లు, ఉద్యోగులకిచ్చిన హామీలు.. ఇవన్నీ వెలగని దీపాలే కదా?’ అని ట్వీట్ చేశారు. తామందించిన 30 పథకాలు అనే దీపాలను ఆర్పేసి చీకటికి ప్రతినిధులయ్యారంటూ విమర్శించారు.