News April 7, 2025
తిరువూరు: బెట్టింగ్ వివాదం.. యువకుడిపై దాడి

తిరువూరులో బెట్టింగ్ విషయమై ఇద్దరు యువకుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఐపీఎల్ మ్యాచ్ విషయమై ఇద్దరి మధ్య క్వార్టర్ బాటిల్ పందెం ఒప్పందం కుదిరింది. కాగా నవీన్ కుమార్ పందెం ఓడిపోవడంతో మద్యం కొనివ్వాలి అని కోరగా అతను నిరాకరించడంతో, మద్యం మత్తులో ఉన్న మహేశ్ ఖాళీ సీసాతో నవీన్‌పై పలుచోట్ల దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన నవీన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 10, 2025
కృష్ణా : ముగిసిన ‘పది’ మూల్యాంకణం

మచిలీపట్నం లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకణ బుధవారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీన మూల్యాంకణ ప్రారంభమవ్వగా మొత్తం 1,89,852 సమాధాన పత్రాలను మూల్యాంకణ చేశారు. సుమారు 1000 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు మూల్యాంకణ విధుల్లో పాల్గొన్నారు.
News April 10, 2025
90 రోజుల పాటు టారిఫ్స్ నిలిపివేత.. చైనాపై మాత్రం 125%కి పెంపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా తప్ప మిగతా 70 దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో చైనాపై టారిఫ్‌ను 125%కి పెంచుతున్నట్లు తెలిపారు. చైనా ప్రపంచ మార్కెట్లను అగౌరవపరిచిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా, అమెరికా వస్తువులపై చైనా 84% టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే.
News April 10, 2025
మీ ఇంట్లో ఏసీ, కూలర్ లేదా? ఇలా చేయండి!

సమ్మర్‌లో ఇల్లంతా వేడిగా ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇంటిని కూల్‌గా ఉంచుకోవచ్చు. ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. వంట ఉదయం, సాయంత్రం చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువగా వాడాలి. టబ్‌లో నీళ్లు పోసి, ఐస్ ముక్కలు వేసి, ఇంటి మధ్యలో పెడితే చల్లగా ఉంటుంది. ఇంటి చుట్టూ మొక్కలు, టెర్రస్‌పై కూల్ పెయింట్ వేసుకోవాలి. కిటికీలకు గడ్డితో చేసిన పరదాలు కడితే కూలర్లకంటే చల్లదనం వస్తుంది.