News March 24, 2025

తిరువూరు: రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడి మృతి.. కారణమిదే.!  

image

తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సరస్వతి(70), కుమారుడు కృష్ణ(53)ను ఆదివారం ఓ లారీ ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఇంత ఘోర ప్రమాదం జరిగినా లారీలు మాత్రం జనసంచారం ఉన్న ప్రదేశాల్లో హైస్పీడ్‌లో వెళుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి లారీలు హైస్పీడ్‌లో వెళ్లకుండా కంట్రోల్ చేయాలని స్థానికులు, వాహనదారులు అన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. 

Similar News

News January 6, 2026

జమ్మలమడుగు: సెట్ 1 కైవసం చేసుకున్న ఏపీ టీం

image

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్‌లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. మొదటి సెట్లో ఏపీ విజయం సాధించింది. ప్రస్తుతం రెండో సెట్ జరుగుతోంది. రెండో సెట్‌లోనూ భారీ వ్యత్యాసంతో ఏపీ టీం దూసుకుపోతోంది. మొత్తం 5 సెట్లు జరుగుతాయి. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.

News January 6, 2026

విద్యుత్ సరఫరా నెట్‌వర్క్ పనులకు REC నిధులు

image

TG: విద్యుత్ సరఫరా నెట్‌వర్క్ బలోపేతానికి REC (Rural Electrification Corporation Limited) ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. తొలుత HYDలో భూగర్భ కేబుల్ నెట్‌వర్క్ అభివృద్ధికి ₹4000 కోట్లు ఇవ్వనుంది. DPR ఖరారు కావడంతో ఈ పనులకు టెండర్లను ఆహ్వానించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. కాగా ఇతర ప్రాంతాల్లోనూ REC నిధులతో విద్యుత్ అభివృద్ధి పనులు చేపడతామని అధికారులు తెలిపారు.

News January 6, 2026

తెనాలి: గూడ్స్ రైల్లో మంటలు.. తప్పిన ప్రమాదం

image

తెనాలి రైల్వే స్టేషన్లో సోమవారం పెద్ద ప్రమాదం తప్పింది. గూడ్స్ రైల్లో ఓ బోగి నుంచి మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పి వేశారు. కృష్ణపట్నం-మహారాష్ట్ర బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో ఓ బోగి నుంచి పొగలు వస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బోగిని రైలు నుంచి వేరు చేసి రైలును పంపించి వేశారు. అగ్నిమాపక కేంద్ర సిబ్బంది వచ్చి ఆగి ఉన్న బోగీలో మంటలు ఆర్పారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.