News February 9, 2026
తిర్యాణిలో మావోయిస్టుల కదలికలు!

తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. డోర్లి-పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగులు, సామగ్రిని గుర్తించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Similar News
News February 11, 2026
అంబటికి పీటీ వారెంట్.. జైలు నుంచి విడుదల మరింత ఆలస్యం

AP: YCP నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లి సివిల్ కోర్ట్ పీటీ వారెంట్ జారీ చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల వేళ పెన్షన్ లబ్ధిదారుల నుంచి రూ.200 మినహాయించుకొని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై గత ప్రభుత్వ హయాంలోనే కేసు నమోదు కాగా తాజాగా పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేయగా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో అంబటిని రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. ఫలితంగా ఆయన విడుదల ఆలస్యం కానుంది.
News February 11, 2026
Exit polls: రామగుండంలో ఏ పార్టీకి సీట్లంటే..!

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. రామగుండం కార్పొరేషన్(60)లో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా ఫలితాలు ఈనెల 13న వెల్లడి కానున్నాయి.
News February 11, 2026
పార్వతీపురం: 18 నుంచి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు

ఈనెల 18 నుండి 21వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులో డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో, హయ్యర్ ట్రేడ్లలో టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. జిల్లాలో గుర్తింపబడిన 2 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తమన్నారు.


