News December 27, 2025
తిర్యాణి: తల్లిదండ్రులు మందలించారని యువతి SUICIDE

ASF జిల్లా తిర్యాణి మండలం నాయకపూగూడకు చెందిన పల్లె స్పందన(19) శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆమె, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైంది. ఇంటికి రావాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఫినాయిల్ తాగింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 27, 2025
KNR కమిషనరేట్‌లో రౌడీలు ఎంతమంది ఉన్నారంటే ..?

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024లో 578 హిస్టరీ షీట్స్ ఓపెన్ కాగా.. 2025లో 575 కేసులు నమోదు చేశారు. ఈ సంవత్సరం కొత్తగా 20 మందిపై కొత్తగా రౌడీ షీట్లు తెరవగా.. 362 సస్పెక్టెడ్ కేసులుగా నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే రౌడీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తరచుగా సీపీ గౌస్ ఆలం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తూ శాంతి భద్రతలను కంట్రోల్‌లో ఉంచుతున్నారు.
News December 27, 2025
తిరుమల: 29 నుంచి 8 వరకు టోకెన్లు ఉండవు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల నేపథ్యంలో TTD కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు తిరుపతిలో జారీ చేసి SSD టోకెన్లు డిసెంబర్ 29 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిలిపివేసింది. 28 ఆదివారం దర్శన టికెట్లు శనివారం ఉదయమే జారీ చేశారు. 29 సోమవారానికి ఇచ్చే టికెట్లు జారీ చేయరు. తిరిగి జనవరి 9వ తేదీకి సంబంధించిన టోకెన్లు 8వ తేదీ జారీ చేయనున్నారు.
News December 27, 2025
రామగిరి ఖిల్లాకు టూరిజం కళ

పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనుంది. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంతో ఉన్న ఈ ప్రాంతం ఇక టూరిస్ట్ స్పాట్‌గా మారబోతోంది. అటవీ శాఖకు రూ.1.14 కోట్లు, టూరిజం శాఖకు రూ.3.86 కోట్లు కేటాయించి పర్వతమాల ప్రాజెక్ట్ కింద రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులతో పరిసర గ్రామాలకు ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.


