News March 6, 2025

‘తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడినా.. సీఎం వివరణ ఇవ్వాలి’

image

తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. రేవంత్ టీపీసీసీ చీఫ్‌, సీఎం కావాలని తీన్మార్ మల్లన్న బలంగా కోరుకున్నారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బలహీనపడుతుందనే కారణంగా రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇవ్వాలని మల్లన్న కోరారని చెప్పారు. తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడినా దానికి వివరణ రేవంత్ రెడ్డి ఇవ్వాలన్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

Similar News

News March 3, 2026

పెద్దపల్లి: అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు: SE

image

పెద్దపల్లి సర్కిల్‌లో విద్యుత్ లేని 69 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని SE వి.గంగాధర్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ లేని కేంద్రాలను గుర్తించి, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలతో పాటు విద్యుత్ సేవలను వేగంగా అందిస్తున్నామన్నారు.

News March 3, 2026

సిరిసిల్ల: జిల్లా ఎస్పీని కలిసిన వేములవాడ డీఎస్పీ

image

వేములవాడ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు జిల్లా ఎస్పీ మహేష్ బి గితేను మర్యాదపూర్వకంగా కలిసారు. మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయనకు సూచించారు.

News March 3, 2026

WGL: మన పెద్ద పులి కనిపించకుండా పోయింది..!

image

పాకాల అడవుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పెద్దపులి 2009లో కనుమరుగైంది. ఆరోజుల్లో పాకాల జనావాసాల మధ్యన రోడ్లపైకి వస్తే జనం భయభ్రాంతులకు గురయ్యేవారు. చివరిగా ఆ పులి, 2009లో కనిపించిందని, అది వేటకు గురై ఉంటుందని వరంగల్ విశ్రాంత అటవీ శాఖ అధికారి తెలిపారు. జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తున్న పులుల ఆనవాళ్లు మహారాష్ట్ర తడోబా, ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతి అరణ్యాలకు చెందినవన్నారు.
# నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం