News November 20, 2024
తీర్యాని: పట్టుదలతో శ్రమిస్తే విజయం మనదే: ఎమ్మెల్యే
పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏది ఉండదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మండలంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉద్యోగాలు సాధించిన వీరిని నిరుద్యోగులు అందరూ ఆదర్శంగా తీసుకొని పోటీ పరీక్షలలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మండల నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2024
ADB: పులికి అభయారణ్యంలో అనుకూల వాతావరణం!
ఉమ్మడి జిల్లాలో ఉన్న కవ్వాల్ అభయారణ్యం పెద్ద పులికి పూర్తిస్థాయి ఆవాసంగా మారిందని అధికారులు అన్నారు. గతంలో మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులులు వచ్చిపోయేవి. ఈసారి మాత్రం రెండు పులులు వచ్చి ఉంటాయని, అందులో ఒకటి ఉట్నూర్-జోడేఘాట్ మీదుగా తడోబాకు వెళ్లి ఉంటే, మరొక పులి నార్నూర్లో మండలంలో సంచరిస్తూ ఉండవచ్చని అధికారులు తెలిపారు. పులులు నివాసాయోగ్య ప్రాంతాలను వెతుకుతున్నాయని వారన్నారు.
News November 21, 2024
ఆదిలాబాద్: బాలికపై మేనమామ అత్యాచారం
ఓ బాలికపై(17) మేనమామ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి వచ్చింది. పోలీసుల వివరాలిలా.. ఆదిలాబాద్‌లోని ఓ కాలనీకి చెందిన బాలికపై మేనమామ కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఎవ్వరికీ చెప్పొద్దంటూ భయపెట్టాడు. ఇటీవల బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చూపించగా విషయం తెలిసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు DSP పేర్కొన్నారు.
News November 21, 2024
జైనూర్: సర్వే పేరుతో విధులకు డుమ్మా
జైనూర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరు చెప్పి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు డుమ్మా కొడుతున్నారు. బుధవారం గ్రామస్థులతో జరిపిన పరిశీలనలో ఈ విషయం బయటపడింది. సర్వే సాకుతో స్కూల్కు ఉపాధ్యాయులు గైర్హాజరవుతున్నరని చెప్పారు. జైనూర్ మండలంలోని గౌరీ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (ఉర్దూ) ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.