News March 5, 2026

తీర ప్రాంతంలో ఇసుక దోపిడీపై MLC ధ్వజం

image

సముద్ర తీరం వెంబడి CRZ పరిధిలో అనధికార ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని MLC ఇజ్రాయిల్ బుధవారం శాసనమండలిలో అన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతోందని విమర్శించారు. తీర ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్రమ తవ్వకాలపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News April 5, 2026

కానిస్టేబుల్‌పై టీడీపీ నేతల దాడి: వైసీపీ

image

CTR: అక్రమ గ్రావెల్ దందాను ప్రశ్నించినందుకు కార్వేటినగరం(M) అల్లాగుంటకు చెందిన AR కానిస్టేబుల్ యుగంధర్‌పై TDP నేతలు దాడికి తెగబడ్డారని YCP ఆరోపించింది. ‘బైక్‌పై వెళ్తున్న యుగంధర్‌పై TDP నాయకులు ఆదాము, ప్రవీణ్, భాగ్యరాజ్ దాడి చేశారు. తీవ్ర గాయాలతో కానిస్టేబుల్ కోమాలోకి వెళ్లిపోయారు. ఏంటి ఈ దారుణం చంద్రబాబు, అనిత. పోలీసులపై ఇలా దాడి చేశారంటే.. ఇక సామాన్యుల్ని బతకనిస్తారా?’ అని YCP ట్వీట్ చేసింది.

News April 5, 2026

నల్గొండలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

image

NLG: స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ జయంతిని ఈరోజు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎన్జీ కళాశాల ఎదురుగా, మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహాలకు కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్, గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

News April 5, 2026

ADB: సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజావాణి రద్దు

image

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 6న రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదుదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని, ఈ మార్పును గమనించి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.