News December 25, 2024
తీర ప్రాంత భద్రతను మరింత మెరుగుపరచాలి: కలెక్టర్

సముద్రపు తీర ప్రాంత భద్రతను మరింత మెరుగుపరచే విధంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో విశాఖపట్నం కోస్టల్ సెక్టార్ పోలీస్ అడిషనల్ ఎస్పీ మధుసూదనరావు, జిల్లా ఎస్పీ కృష్ణారావు, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, కోస్ట్ గార్డ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సముద్ర తీర ప్రాంత భద్రత రక్షణా చర్యలపై సమీక్షించారు.
Similar News
News December 31, 2025
కోనసీమ నుంచి తూర్పుగోదావరికి మూడు మండలాలు!

జిల్లాల పునర్విభజన చట్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ నుంచి మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో చేర్చుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం అధికారికంగా వెల్లడించారు. తాజా మార్పులతో ఆయా ప్రాంతాల భౌగోళిక పరిధి మారనుంది.
News December 31, 2025
అతిపెద్ద జిల్లాగా అవతరించనున్న ‘తూ.గో.’

మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై అధికారిక కార్యకలాపాలన్నీ రాజమహేంద్రవరం కేంద్రంగానే సాగనున్నాయి. ఈ విలీనంతో తూ.గో. జిల్లా విస్తీర్ణం పెరిగి భారీ జిల్లాగా అవతరించనుంది. నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో విలీన ప్రక్రియపై చర్చించనున్నారు.
News December 31, 2025
తూ.గో.లో ‘మత్తు’ రికార్డు.. డిసెంబర్‌లోనే 100 కోట్లు హాంఫట్!

తూర్పుగోదావరి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.100 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు అధికార గణాంకాలు తెలిపాయి. కొత్త ఏడాది వేడుకల కోసం ఎక్సైజ్ శాఖ రూ.25 కోట్ల విలువైన 1.60 లక్షల కేసుల మద్యాన్ని సిద్ధం చేసింది. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


