News December 10, 2025

‘తుంగతుర్తిలో బెదిరింపులు, దాడులు అధికమయ్యాయి’

image

నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో హత్యకు గురైన BRS కార్యకర్త ఉప్పల మల్లయ్య పార్థివ దేహానికి సూర్యాపేట ఏరియా ఆసుపత్రి వద్ద మాజీ మంత్రి, MLA జగదీష్ రెడ్డి, మాజీ MLA గాదరి కిషోర్ కుమార్, మాజీ MP లింగయ్య యాదవ్ నివాళులు అర్పించారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అరాచకాలు పెరిగాయని, తుంగతుర్తిలో బెదిరింపులు, దాడులు అధికమయ్యాయని, మల్లయ్య హత్య ప్రజల్లో భయాందోళనలు రేపుతోందన్నారు

Similar News

News December 10, 2025

ప్రేమ పేరుతో మోసం చేసిందని మహిళా డీఎస్పీపై ఫిర్యాదు

image

రాయ్‌పూర్ డీఎస్పీ కల్పన వర్మ తనను మోసం చేశారని ఆరోపిస్తూ బిజినెస్‌మ్యాన్ దీపక్ టాండన్ కేసు పెట్టారు. 2021లో ప్రేమ పేరుతో రిలేషన్‌షిప్‌లోకి దింపి, బ్లాక్‌మెయిల్ చేసి తన నుంచి రూ.2 కోట్ల డబ్బు, డైమండ్ రింగ్, కారు, గోల్డ్ చైన్, లగ్జరీ గిఫ్ట్స్, తన హోటల్‌ ఓనర్‌షిప్ రాయించుకున్నట్టు ఆరోపించారు. క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలను కల్పన వర్మ ఖండించారు.

News December 10, 2025

వికారాబాద్: ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ హెచ్చరిక

image

జిల్లాలో జరగనున్న మొదటి దశ ఎన్నికల విధులకు ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్నేహ మెహ్రా హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకోవాలని సూచించారు.

News December 10, 2025

ఇండిగో ఎఫెక్ట్.. ఢిల్లీ ఎకానమీకి రూ.1000 కోట్ల నష్టం

image

ఇండిగో సంక్షోభంతో ఢిల్లీలోని పలు వ్యాపార రంగాలు రూ.1000 కోట్లు నష్టపోయాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. ట్రేడర్స్, టూరిస్ట్స్, బిజినెస్ ట్రావెలర్స్ తగ్గారని CTI ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ చెప్పారు. వారం రోజుల్లో ఢిల్లీలోని హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్టుల్లో చాలా బుకింగ్స్ రద్దయ్యాయన్నారు. ఆటో మొబైల్స్, హోమ్ నీడ్స్, చేనేత వస్త్రాల ప్రదర్శనలకు సందర్శకులు కరవయ్యారని తెలిపారు.