News October 13, 2024

తుంగతుర్తి: వేలంపాటలో దుర్గామాత చీరను దక్కించుకున్న ముస్లింలు

image

తుంగతుర్తి మండలం అన్నారు గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దుర్గమ్మ తల్లి చీర వేలం పాటలో ముస్లిం సోదరులు చీరను దక్కించుకున్నారు. ఈ మేరకు ఎండి.సిద్ధిక్ భాష, ఆజం అలీ పాల్గొని చీరను రూ.4100లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో చాలామంది పోటీపడి వేలం హోరాహోరీగా సాగింది. ఈ సంఘటన కులమత సామరస్యతకు ప్రత్యేకంగా నిలవడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు.

Similar News

News February 28, 2026

నల్గొండ: నేడే ఆఖరు.. 2.42 లక్షల మంది పెండింగ్

image

జిల్లాలోని రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు అందాలంటే తప్పనిసరిగా చేసుకోవాల్సిన ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ గడువు నేటితో ముగియనుంది. జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు కేవలం 55.06 శాతం మంది రైతులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 5,39,619 మంది రైతులు ఉండగా, ఇంకా 2,42,492 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. మునుగోడు మండలంలో మాత్రమే అత్యధికంగా (70.22%) నమోదైంది.

News February 28, 2026

నల్గొండ: సీఎంఆర్‌ అక్రమాల్లో లీకుల కలకలం!

image

జిల్లాలో సీఎంఆర్‌ అక్రమాల కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల రాకపై ముందస్తు సమాచారం అందడంతో మిల్లర్లు ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేసి పరారయ్యారు. కేసులు నమోదైన మరుసటి రోజే ఎఫ్‌ఐఆర్‌ కాపీలు నిందితులకు చేరడం, వారు వెంటనే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాఖా పరమైన లీకులపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

News February 28, 2026

నల్గొండ: పంచాయతీ నిధులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

image

15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై కలెక్టర్ కార్యాలయం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. నిధుల దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని ఆదేశించింది. బేసిక్ గ్రాంట్లను 29 రకాల అభివృద్ధి పనులకు (జీతాలు మినహా) వాడవచ్చని తెలిపింది. టైడ్ గ్రాంట్లలో 50% పారిశుధ్యానికి, 50% తాగునీటి సరఫరాకు కేటాయించాలని పేర్కొంది. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రాధాన్యత క్రమంలో మార్చి 5, 2026 లోపు చెల్లించాలన్నారు.