News March 4, 2025

తుంగతుర్తి: 18 మందికి షోకాజ్ నోటీసులు

image

తుంగతుర్తిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 18 మందికి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఎమ్మెల్యే మందుల సామేలు గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ప్రిన్సిపల్‌తో పాటు 15 మంది టీచర్లకు, ఇద్దరు వంట మనుషులు విధుల్లో లేకపోవడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.

Similar News

News November 3, 2025

VJA: వన్ హెల్త్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

image

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణ లక్ష్యంగా ఒకే ఆరోగ్యం (వన్ హెల్త్) అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రారంభించారు. ప్రతి ఏటా నవంబర్ 3న వన్ హెల్త్ డే జరుపుకుంటారని చెప్పారు.

News November 3, 2025

జాప్యం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియ పాల్గొన్నారు. అందిన మొత్తం 194 ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించి, పౌరుల సంతృప్తిని నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. సరైన కారణం లేకుండా జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 3, 2025

వైఫల్యం చెందిన అధికారిపై చర్యలు: కలెక్టర్

image

సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి 454 అర్జీలు అందాయని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ప్రజా సమస్యలను కేటాయించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆమె ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అర్జీలకు రీఓపెన్ లేకుండా పరిష్కరించాలని, వైఫల్యం చెందిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.