News August 19, 2025

తుంగభద్ర జలాశయం 26 గెట్లు ఎత్తివేత

image

ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల రైతులకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర జలాశయం వరుస వర్షాల కారణంగా మంగళవారం నిండుకుండలా మారింది. దీంతో బోర్డు అధికారులు జలాశయం నుంచి 26 గేట్లను ఎత్తి దిగువన గల నదికి నీటిని విడుదల చేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో ఉన్న నీటి సామర్థ్యం 1,626 అడుగులుగా ఉంది.

Similar News

News August 19, 2025

మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

సమాజాన్ని నిర్వీర్యం చేసే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్ భాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ భవనంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి “డ్రగ్స్ వద్దు బ్రో” పోస్టర్లను ఆవిష్కరించారు. జేడ్పీ సీఈఓ నాసర రెడ్డి, కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

News August 19, 2025

కర్నూలులో మహిళా దొంగలు అరెస్ట్

image

కర్నూల్ ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కే ప్రయాణికుల వద్ద బంగారు గొలుసులు, పర్సులను దొంగిలిస్తున్న మహిళా దొంగలు షేక్ ఖాజాబీ, షేక్ ఫరీదాను సోమవారం అరెస్టు చేసినట్లు కర్నూలు 4వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు. ఈనెల 13న అలంపూర్‌కు చెందిన విమలమ్మ పర్సు దొంగిలించినట్లు ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇరువురు మహిళలను అరెస్టు చేశామన్నారు. విచారణలో నేరం అంగీకరించారన్నారు.

News August 19, 2025

రూ. వెయ్యి జరిమానా: కర్నూలు ట్రాఫిక్ సీఐ

image

కర్నూలులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే యజమానులకు జరిమానా విధిస్తున్నట్లు కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు. సోమవారం సీఐ ట్రాఫిక్ పోలీసులతో కలిసి సి.క్యాంప్, బళ్లారి చౌరస్తా, రాజ్ విహార్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ఉన్న వాహనదారులకు రోజా పువ్వు ఇచ్చి, హెల్మెట్ లేని 100 మందికి రూ. 1000 చొప్పున జరిమానా విధించామన్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని సూచించారు.