News August 20, 2024
తుంగభద్ర డ్యాం.. ఇన్ ఫ్లో 31,435 క్యూసెక్కులు

తుంగభద్ర డ్యాం నుంచి నదికి నీటి విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 31,435 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం మొత్తం నీటి సామర్థ్యం 105.33 టీఎంసీలుకాగా ప్రస్తుతం 76.780 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం అవుట్‌ఫ్లో 10,089 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 11, 2026
రైల్వే సమస్యలను పరిష్కరించండి: ఎంపీ వినతి

జిల్లాలో నెలకొన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ నాగరాజు కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొంటున్న ఆయన.. బుధవారం ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. కర్నూలు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు కొత్త రైలు సర్వీసులను పెట్టడంతో పాటు ఇతర సర్వీసులను పొడిగించాలని కోరారు.
News February 11, 2026
బకాయిల వసూలుపై కఠినంగా వ్యవహరించాలి: కలెక్టర్

కలెక్టరేట్‌లో GST అమలుపై కలెక్టర్ ఏ.సిరి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పన్నుల వసూళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలపై కఠినంగా వ్యవహరించి, వాటిని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సెక్షన్ 51 ప్రకారం ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు GST రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు. ప్రతీ నెల 20వ తేదీ లోపు రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలన్నారు.
News February 11, 2026
ఈ నెల 13న మందకృష్ణ మాదిగ రాక

కౌతాళం మండలం హాల్వి, గుడికంబళి గ్రామాలలో ఈ నెల 13న బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు MRPS జిల్లా ఇన్‌ఛార్జ్ దుమ్ము చిన్న వెంకటేశ్వర్లు మాదిగ, MSP జిల్లా అధికార ప్రతినిధి జి.ఆనంద్ చైతన్య మాదిగ తెలిపారు. కార్యక్రమానికి MRPS వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఇవాళ గోనెగండ్లలో అందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.


