News November 28, 2024

తుంగభద్ర తీరంలో మొసలి కలకలం

image

తుంగభద్ర నది తీరంలో మొసలి కలకలం లేపింది. కౌతాళం మండలం గుడి కంబాలి సమీపంలో గురువారం తుంగభద్ర నది ఒడ్డున పెద్ద మొసలి పొలాల వైపు రావడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఏడాదిలో తుంగభద్ర నది తీరంలోని అనేక గ్రామాల పంట పొలాలలో మొసళ్లు కంటబడుతున్నాయి. నది చాగీ, కుమ్మలనూరు, మురళి గ్రామాల సమీపంలో 2 నెలల నుంచి మొసళ్లు సంచరిస్తూనే ఉన్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

Similar News

News November 28, 2024

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంపు పై ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్ లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News November 28, 2024

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి: కలెక్టర్

image

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధిపై జేసీ సీ.విష్ణు చరణ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారి రాము నాయక్, తదితర అధికారులు ఉన్నారు.

News November 28, 2024

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వర్చువల్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు వర్చువల్ విధానం ద్వారా నాణ్యమైన బోధన అందించాలని సూచించారు.