News April 15, 2025
తునిలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

తుని మండలం కె.సీతయ్యపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సూరాడ నూకరత్నం (26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నూకరత్నం భర్త శివ విషప్రయోగం చేసి హతమార్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 18, 2025
నిర్మల్: అందుబాటులో రాండమ్ డోనర్ ప్లేట్లెట్లు

నిర్మల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో రాండమ్ డోనర్ ప్లేట్లెట్లు (RDP) అందుబాటులో ఉన్నాయని సిబ్బంది తెలిపారు. RDPలు డెంగ్యూ, జ్వర బాధితులకు, కీమోథెరపీ చికిత్స పొందుతున్న రోగులకు, తక్కువ ప్లేట్లెట్లు ఉన్న పరిస్థితుల్లో అవసరమైన రోగులకు ఉచితంగా అందజేస్తామన్నారు. సమాచారం కోసం నిర్మల్ GGH బ్లడ్ బ్యాంక్‌ను సంప్రదించాలని కోరారు.
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
News September 18, 2025
నల్లగొండ : పత్తి కొనుగోలుకు సన్నాహాలు

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈసారి 5,67,613 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా సుమారు 4,54,090 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 7పత్తి కేంద్రాల కింద 24 పత్తి మిల్లులు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిపై చేయనున్నారు.