News May 3, 2024
తునిలో పవన్ ప్రచారం.. రూట్ మ్యాప్ ఇదే

కాకినాడ జిల్లా తునిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుని మండలం చామవరం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ ఉంటుందని తెలిపారు. అక్కడి నుంచి పవన్ ప్రత్యేక వాహనంపై గొల్లప్పారావు సెంటర్‌కు చేరుకొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
Similar News
News February 28, 2026
తూ.గో: పొట్టకూటి కోసం వెళ్తూ.. మృత్యవాత

తూ.గో. జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై లారీ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం(M) పాతబగ్గానికి చెందిన కొందరు సభ్యులు కృష్ణాజిల్లా గుడివాడ మినప చేలు తీత కోసం బయలుదేరి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్ర మత్తులో ఉండగా లారీ వెనక డోర్ పైనుంచి జారిపడి తలకు దెబ్బ తగిలి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.
News February 28, 2026
ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ: ఎంపీ

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ముప్పును ముందస్తుగా అరికట్టేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.