News July 5, 2025
తునిలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రైన్ ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం తుని రైల్వే స్టేషన్ 1వ ప్లాట్‌ఫాం చివర తెల్లవారుజామున రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో మృతి చెందాడు. అతడి వయసు సుమారు 45 ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Similar News
News July 5, 2025
బాపట్లలో ఎలక్ట్రికల్ ఆటోల అందజేత

ప్రజల జీవనోపాధులు మెరుగుపరచుకోవడానికి మెప్మా శాఖ ద్వారా చీరాల మండలంలో 2, బాపట్ల మండలంలో 2 ఎలక్ట్రికల్ ఆటోలను ముద్రా రుణం కింద కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ లబ్ధిదారులకు అందజేశారు. ఒక్కొక్క యూనిట్ ఖరీదు రూ.3.63 లక్షలు అన్నారు. ఈ వాహనాలను రాపిడో సంస్థతో అనుసంధానించడం ద్వారా లబ్ధిదారులకు రూ.56 వేల ప్రోత్సాహకం అందజేస్తామన్నారు.
News July 5, 2025
MBNR: BJP కొత్త సారథి.. అభినందించిన డీకే అరుణ

హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాలమూరు ఎంపీ, జాతీయ కౌన్సిల్ మెంబెర్ డీకే అరుణ నూతన ఆయన్ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News July 5, 2025
వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉస్మాన్ సాహెబ్

వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా గోనెగండ్లకు చెందిన కార్యకర్త ఉస్మాన్ సాహెబ్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఉస్మాన్ సాహెబ్ మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్త అయిన తనకు అధిష్ఠానం జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక, ఎంపీపీ నస్రుద్దీన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.