News January 8, 2026
తుని: ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

పూరి-తిరుపతి(17479) ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. తుని–హంసవరం మధ్య రైలు ప్రయాణిస్తుండగా B-5 బోగీలోని విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న దుప్పట్లకు నిప్పు అంటుకోవడంతో అప్రమత్తమైన ప్రయాణికులు కాలిపోతున్న దుప్పట్లను బయటకు విసిరేయడంతో ముప్పు తప్పింది. అనంతరం రాజమహేంద్రవరం స్టేషన్‌లో రైలును నిలిపివేసి సాంకేతిక నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు.
Similar News
News February 4, 2026
14వ తేదీ నుంచి వేటను నిలిపివేయండి: జేడీ లక్ష్మణరావు

విశాఖలో జరగనున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్-2026 వేడుకల నేపథ్యంలో ఫిబ్రవరి 14 నుంచి 21వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మూలపాలెంలో నిర్వహించిన సదస్సులో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నేవీ సూచనలు పాటించాలని, బోట్లు సంచరించకుండా సహకరించాలని ఆయన కోరారు. తీర ప్రాంతాల పరిశుభ్రతపై కూడా మత్స్యకారులకు అవగాహన కల్పించారు.
News February 4, 2026
సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24వ తేదీ 6PM వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను <
News February 4, 2026
అల్లూరి కలెక్టర్ కీలక ఆదేశాలు

అల్లూరి, పోలవరం జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక, అటవీ, ఐటీడీఏ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ‘హోం స్టే’ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.


