News November 30, 2025

తుని ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సస్పెండ్..!

image

తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంది. ఓ యువకుడికి నిర్వహించిన శస్త్రచికిత్సలో <<18421093>>సర్జికల్ బ్లేడ్‌<<>>ను లోపలే ఉంచి కట్టు కట్టడంపై ‘ఎక్స్‌రే చూసి షాక్.. కాలిలో సర్జికల్ బ్లేడ్.!’ శీర్షికన శనివారం Way2News కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు ఆర్థోపెడిక్ వైద్యుడు డా. సత్యసాగర్, స్టాఫ్ నర్స్ పద్మావతిని ఆదివారం సస్పెండ్ చేశారు.

Similar News

News December 6, 2025

11 నుంచి అటల్-మోదీ సుపరిపాలన యాత్ర

image

AP: ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా అటల్-మోదీ సుపరిపాలన యాత్ర చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి ఆవిష్కరించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ శతజయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నామన్నారు. దేశ హితం కోసమే ఆయన నిత్యం తపించేవారని, గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారని గుర్తుచేసుకున్నారు.

News December 6, 2025

NTR జిల్లాలో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు

image

NTR జిల్లాలో 2 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జ్వరంతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన జి.కొండూరుకు చెందిన రెండున్నరేళ్ల బాలుడు పాత ప్రభుత్వాసుపత్రి పిల్లల విభాగంలో, కంచికచర్లకు చెందిన 45 ఏళ్ల మహిళ కొత్త ప్రభుత్వాసుపత్రి జనరల్‌ మెడిసిన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, అవసరమైన చికిత్స అందుతున్నట్లు సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు తెలిపారు.

News December 6, 2025

INDvsSA.. ఇద్దరు ప్లేయర్లు దూరం!

image

భారత్‌తో మూడో వన్డేకు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ బర్గర్, బ్యాటర్ టోనీ డి జోర్జి గాయాల కారణంగా దూరమయ్యారు. జోర్జి T20 సిరీస్‌కూ దూరమైనట్లు SA బోర్డు వెల్లడించింది. టీ20లకు ఎంపికైన పేసర్ మఫాకా ఇంకా కోలుకోలేదని, అతడి స్థానంలో సిపమ్లాను ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా తొలి వన్డేలో 39 రన్స్ చేసిన జోర్జి, రెండో వన్డేలో 17పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. బర్గర్ 2 మ్యాచుల్లో 3 వికెట్లు తీశారు.