News February 27, 2026
తుని: ఐదేళ్లు.. ముగ్గురు మహిళలు

తుని మున్సిపాలిటీ ఐదేళ్ల పాలనలో ముగ్గురు ఛైర్ పర్సన్లు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఛైర్ పర్సన్‌గా ఉన్న నార్ల భువన సుందరి పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. 2021లో YCP నుంచి ఏలూరి సుధారాణి బాధ్యతలు చేపట్టగా, 2025లో రాజీనామా చేశారు. అనంతరం కుచ్చర్లపాటి రూపాదేవి ఆ బాధ్యతలు చేపట్టారు. తదుపరి భువన సుందరి చైర్ పర్సన్‌గా ఎంపికై పదవీకాలాన్ని పూర్తి చేస్తున్నారు.
Similar News
News February 28, 2026
మల్బరీ తోటను పరిశీలించిన మంత్రి సవిత

పరిగి మండలంలో పింఛన్ పంపిణీకి వెళ్తుండగా మనేసముద్రం సమీపంలో రైతు చౌడప్పకు చెందిన మల్బరీ తోటను మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతుతో మాట్లాడి పంట దిగుబడి, పెట్టుబడి, రాబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మల్బరీ సాగులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె.. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
News February 28, 2026
HYDలో సిల్ట్ ఛాంబర్ లేకుండా.. వేల హోటళ్లు!

HYDలో సిల్ట్ ఛాంబర్లు లేకుండా వేల సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ జలమండలి కఠిన చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. హోటల్ రెస్టారెంట్ల నుంచి భారీగా కూరగాయల వ్యర్ధాలు వచ్చి డ్రైనేజీలో కలుస్తుండడంతో బ్లాక్ కేజీ జరిగి మ్యాన్ హోల్స్ నుంచి పొంగి పొర్లుతుంది. దీంతో సిల్ట్ ఛాంబర్ తప్పనిసరి చేశారు. కానీ జరిమానాలు విధించడం మున్నాళ్ల ముచ్చటగా మారిందంటున్నారు.
News February 28, 2026
కామారెడ్డి: అన్నను చంపిన తమ్ముడు

బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం రాత్రి ఘోరం జరిగింది. ఆస్తి గొడవలతో తమ్ముడు నారాయణ తన అన్న మెరుగు సాయిలు (56)ను హతమార్చాడు. పాలగుండం వద్ద ఇద్దరి మధ్య మొదలైన వివాదం ముదరడంతో, ఆగ్రహానికి లోనైన నారాయణ దాడి చేయగా సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షలు, ఆస్తి గొడవలే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


