News September 21, 2025
తుని: క్రేన్ ఢీకొని వ్యక్తి మృతి

తుని రైల్వే ఫ్లైఓవర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై నడుచుకుంటూ వెళ్తున్న పాయకరావుపేట వాసి ప్రసాద్ (28)ను వేగంగా వచ్చిన క్రేన్ ఢీకొంది. ఈ ఘటనలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పాయకరావుపేటలో సువార్తకుడుగా జీవనం సాగిస్తున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 21, 2025
దసరా ఉత్సవాలు: కనకదుర్గమ్మ 11 అలంకారాలు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు రేపటి నుంచి OCT 2 వరకు జరగనున్నాయి. 11 రోజుల పాటు దుర్గమ్మ 11 అలంకారాలలో దర్శనమివ్వనున్నారు.
*SEP 22:బాలాత్రిపుర సుందరీ దేవి *23:గాయత్రీ దేవి *24:అన్నపూర్ణాదేవి *25:కాత్యాయనీ దేవి *26:మహాలక్ష్మీ దేవి *27:లలితా త్రిపుర సుందరీ దేవి *28:మహాచండీ దేవి *29:సరస్వతీ దేవి *30:దుర్గాదేవి *అక్టోబర్ 1:మహిషాసురమర్దిని దేవి *అక్టోబర్ 2:రాజరాజేశ్వరీ దేవి
News September 21, 2025
నెల్లూరు మున్సిపల్ లీగల్ అడ్వైజర్‌గా రంగారావు

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లీగల్ అడ్వైజర్‌గా ప్రముఖ న్యాయవాది రంగారావును నియమిస్తూ కమిషనర్ నందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మూడేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. ఈయన గతంలో ఇంటి పన్నులతో పాటు పలు అంశాల్లో మున్సిపల్ కార్పొరేషన్‌కు ₹ 3.70 కోట్లు జమ కావడానికి కారకులు కావడంతో ఈయన సేవలను గుర్తించి ఈ పదవి ఇచ్చేందుకు తీర్మానం చేశారు.
News September 21, 2025
నగరవాసులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ముఖ్య విజ్ఞప్తి

దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశా నగరవాసులకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి వద్ద రద్దీ ఎక్కువగా ఉండే సమయాలలో అనవసరంగా ఆ మార్గాలలో ప్రయాణించవద్దని ఆయన కోరారు. నగరం పరిశుభ్రంగా ఉండేందుకు సహకరించాలని.. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలలో నగరవాసులు.. భక్తులకు స్వచ్చందంగా సేవ చేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.