News February 16, 2025
తుని: బ్యాంక్‌లో బంగారం గోల్‌మాల్.. ఖాతాదారుల ఆందోళన

తుని మండలం తేటగుంటలో కెనరా బ్యాంక్‌లో అవినీతి కేసు కలకలం రేపుతోంది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారంలో తేడాలు ఉన్నట్లు గుర్తించడంతో, బ్యాంకు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. గోల్డ్ ఖాతాలు 3,500 ఉండగా 150 ఖాతాల్లో తాకట్టు బంగారం వ్యత్యాసం ఉన్నట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. ఖాతాదారులు ఎవరు ఆందోళన చెందవద్దని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు అధికారులను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Similar News
News November 5, 2025
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు: సమాఖ్య ఛైర్మన్

TG: PVT కాలేజీల యాజమాన్యాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన బెదిరిస్తున్నారని సమాఖ్య ఛైర్మన్ రమేష్‌బాబు ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం 3 రోజులుగా బంద్ కొనసాగుతుండగా చర్చలకు పిలిచి ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని మండిపడ్డారు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుకు వేసిన కమిటీలో సంబంధం లేని ఇద్దరిని తొలగించాలన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ విరమించేది లేదని తేల్చి చెప్పారు.
News November 5, 2025
MNCL: ఈ నెల 9న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు

కాసిపేట మండలం సోమగుడెం సింగరేణి మైదానంలో ఈ నెల 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో 9న ఉదయం 9గంటలకు హాజరుకావాలని జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్ సూచించారు.
News November 5, 2025
8 కిలోమీటర్లు కాలినడకన గుట్టకు చేరిన కలెక్టర్

కొత్తగూడెం:జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ 8 కి.మీ.లు నడిచి చండ్రుగొండ మండలం కనకగిరి (కనకాద్రి) గుట్టపై ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించారు. కాకతీయుల కాలం నాటి కట్టడాల సంరక్షణ బాధ్యత మనదేనన్నారు. గుట్టపై సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వెదురు ఉత్పత్తుల తయారీదారులైన గిరిజనులను ఆయన అభినందించారు.


