News April 10, 2024
తుని: రైలు నుంచి పడి గుర్తుతెలియని మహిళ మృతి

రావికంపాడు – అన్నవరం రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని మహిళ బుధవారం రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడింది. తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సుమారు 5అడుగులు ఎత్తు కలిగి పచ్చని చీర కట్టుకుని ఉంది. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో తరలించారు. ఆమె ఆచూకీ తెలిసినవారు తుని రైల్వేపోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎస్సై లోవరాజుని సంప్రదించాలని కోరారు.
Similar News
News March 1, 2026
రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.
News March 1, 2026
తూ.గో: ఇక ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

రవాణాశాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తూ.గో రవాణాధికారి ఆర్. సురేశ్ శనివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ‘Sarathi Parivahan’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్ చెల్లింపుల వంటి సేవలను ‘Vahan Parivahan’ పోర్టల్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇంటి నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News February 28, 2026
RJY: ట్రంప్ తీరుపై సీపీఐ నారాయణ ధ్వజం

అమెరికా విధానాలు, ట్రంప్ తీరు వల్ల దేశంలో వ్యవసాయం, చేనేత రంగాలు నాశనమవుతున్నాయని CPI నేత కె.నారాయణ విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ట్రంప్‌నకు బానిసగా మారిందని మండిపడ్డారు. సామాన్యులను వదిలేసి కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


