News January 7, 2026

తుని: షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం!

image

తుని రైల్వే స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం <<18788412>>అగ్ని ప్రమాదం<<>> జరిగిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్టేషన్ పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్ వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టారు. పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News February 5, 2026

ADB: ఒకే వేదికపై తండ్రి, కొడుకు.. అరుదైన రాజకీయ ప్రస్థానం

image

ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో జోగు రామన్న కుటుంబం అరుదైన రికార్డు సృష్టించింది. జోగు రామన్న ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే, 2020 మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద కుమారుడు ప్రేమేందర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 34వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. తండ్రి ఎమ్మెల్యేగా, కొడుకు మున్సిపల్ ప్రజా ప్రతినిధులుగా కొనసాగి ప్రజల మన్ననలు పొందారు.

News February 5, 2026

AIIMS గోరఖ్‌పూర్‌లో ఉద్యోగాలు

image

<>AIIMS<<>> గోరఖ్‌పూర్‌ 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 21వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(జియోగ్రఫీ, బయో స్టాటిస్టిక్స్, డెమోగ్రఫీ, పాపులేషన్ స్టడీస్), PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in

News February 5, 2026

తిరుపతి చేరుకున్న TTD నూతన EO

image

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారి (EO)గా బాధ్యతలు చేపట్టేందుకు తిరుపతికి వచ్చిన యం.రవిచంద్రకు జిల్లా యంత్రాంగం స్వాగతం పలికింది. స్థానిక అతిథి గృహం వద్ద ఆయనకు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, JC ఆర్.గోవిందరావు, SP ఎల్.సుబ్బారాయుడు పూల బొకే అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో ఈఓ ప్రాథమికంగా చర్చించారు.