News November 20, 2025
తుపాన్ నష్టం రూ. 88 కోట్లు.. సాయం కోసం రైతన్నల ఎదురుచూపులు.!

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొంథా తుపాన్ వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణా (D)లో వరి పైరు 54వేలు, గ్రౌండ్‌నట్, ఇతర పంటలు కలిపి 2వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. మొత్తం రూ.75.71కోట్లు నష్టం కాగా, NTR (D)లో వరి 5వేలు, పత్తి 4వేల ఎకరాల్లో పంట దెబ్బతినగా.. రూ.12.19కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. నిధుల విడుదల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
Similar News
News November 20, 2025
రైతులకు బాబు వెన్నుపోటు: YCP

AP: ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు రైతులకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ విమర్శించింది. అన్నదాత సుఖీభవ పథకం తొలి రెండు విడతల్లో <<18329772>>7 లక్షల మంది<<>> లబ్ధిదారులను తొలగించారని ఆరోపించింది. వైసీపీ హయాంలో 53.58 లక్షల మందికి ఈ పథకం కింద డబ్బులు అందేవని వెల్లడించింది. అలాగే పంటలకు మద్దతు ధరలు కూడా ఇవ్వట్లేదని ట్వీట్ చేసింది.
News November 20, 2025
రాజన్న ఆలయ ఏఈఓకు ప్రచార రథం బాధ్యతలు అప్పగింత

వేములవాడ రాజన్న ఆలయం సహాయ కార్య నిర్వహణాధికారి బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌కు స్వామి వారి ప్రచార రథం ఏఈఓగా బాధ్యతలు అప్పగించారు. అభివృద్ధి పనుల నిమిత్తం రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేసి ప్రచార రథం వద్ద దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రీనివాస్‌కు ప్రచార రథం వద్ద అదనపు బాధ్యతలు అప్పగించారు. భీమేశ్వరాలయంతో పాటు మరికొన్ని విభాగాలకు ఆయన ఏఈఓగా కొనసాగుతారు.
News November 20, 2025
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో హైబీపీ ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో బీపీ ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి బీపీ చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.


