News October 28, 2025

తుఫానుపై ఏలూరు జిల్లా పోలీస్ అప్రమత్తం

image

తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే పోలీసుల కర్తవ్యం అని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. జిల్లా ప్రజల కోసం ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. రెస్క్యూ టీమ్‌లు, డ్రోన్లను వినియోగిస్తాయని, అత్యవసరమైతే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, తద్వారా తక్షణ సహాయం అందుతుందని ఆయన సూచించారు.

Similar News

News October 28, 2025

తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

image

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

News October 28, 2025

సూర్యాపేట: ప్రజలకు సుపరిపాలన అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సరైన రీతిలో ప్రజలకు చేరే విధంగా అధికారులు పారదర్శకతతో, బాధ్యతగా విధులు నిర్వహించి అర్హులైన వారిని మాత్రమే గుర్తించాలన్నారు.

News October 28, 2025

5,407 మంది నిర్వాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

image

మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో 5,407 మంది నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 119 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి వసతి కల్పించామన్నారు. అత్యవసర సహాయం నిమిత్తం వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు.