News October 29, 2025
తుఫాను: అన్నమయ్య జిల్లాలో సెలవు ప్రకటించాలని డిమాండ్

మొంథా తుఫానుతో ఇవాళ అన్నమయ్య జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD ప్రకటిచింది. వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలోనూ సెలవు ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వర్షాల ముప్పుతో విద్యార్థుల భద్రత దృష్ట్యా సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. తుఫాను దృష్ట్యా ప్రభుత్వం జిల్లాకు ₹50లక్షల నిధులు విడుదల చేసింది.
Similar News
News October 29, 2025
TG: మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వానలు పడతాయంటూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పిల్లల్ని బయటికి పంపించొద్దని తల్లిదండ్రులకు సూచించారు.
News October 29, 2025
GNT: అత్యాచారయత్నంపై బాధితురాలి ఫిర్యాదు

కూతురిపై అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించిన మారుతండ్రిపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు (D) రాజుపాలెం (మం) బ్రాహ్మణపల్లికి చెందిన ఓ మహిళ పెళ్లై భర్తతో విభేదాల కారణంగా దూరమైంది. ప్రస్తుతం గుంటూరు పొట్టిశ్రీరాములునగర్‌లో మరో వ్యక్తితో ఉంటుంది. అయితే ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో కూతురిపై మారుతండ్రి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
News October 29, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. HYDలో సెలవుకు డిమాండ్

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో HYDతో సహా ఉమ్మడి RRలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నగరంమంతా మబ్బు కమ్మేసి ఇంకా చీకటిగా ఉంది. కాగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని నగరవాసుల నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి విద్యాలయాలకు తడుస్తూనే వెళ్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలో సెలవులు ప్రకటించగా HYDలో ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్.


