News October 26, 2025
తుఫాన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

మొంథా తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 27, 28, 29వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం మన్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 27, 2025
శుభ సమయం (27-10-2025) సోమవారం

✒ తిథి: శుక్ల షష్ఠి తె.3.07 వరకు
✒ నక్షత్రం: మూల ఉ.10.27
✒ శుభ సమయాలు: సామాన్యము
✒ రాహుకాలం: ఉ.7.30-9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, వర్జ్యం: ఉ.8.43-10.28, రా.8.46-10.30, ✒ అమృత ఘడియలు: లేవు
✍️ రోజువారీ పంచాంగం, రాశి ఫలాలు కోసం <<-se_10009>>క్లిక్<<>> చేయండి.
News October 27, 2025
అన్నమయ్య: ఈ రెండు రోజులు జాగ్రత్త

అన్నమయ్య జిల్లాకు ఇవాళ్టి నుంచి తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు. అలాగే ఏవైనా సహాయ చర్యలు కావాల్సి ఉంటే 112 లేదా రాయచోటి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08561-293006 ఫోన్ చేయాలని ఎస్పీ ధీరజ్ సూచించారు. అలాగే వాగులు, వంకలు, నదులు, చెరువుల దగ్గరకు వెళ్లవద్దన్నారు.
#SHARE IT
News October 27, 2025
చిత్తూరులో పటిష్ఠ బందోబస్తు

గత మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సోమవారం నిందితులకు శిక్ష ఖరారు కానున్న నేపథ్యంలో చిత్తూరులో పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చిత్తూరు 1, 2 టౌన్ స్టేషన్ల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కోర్టు పరిధిలో లాయర్లు సిబ్బందిని తప్ప మరెవరిని అనుమతించామన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.


