News November 30, 2025
తుఫాన్ ఎఫెక్ట్: ఒంగోలులో కాల్ సెంటర్ ఏర్పాటు

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలులోని నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం కమిషనర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. తమ కార్యాలయంలో 08592-227766 నంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రెస్క్యూ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News February 11, 2026
అనుమతుల జారీలో జాప్యం ఉండరాదు: జేసీ

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.
News February 11, 2026
జిల్లా ప్రజలకు ప్రకాశం ఎస్పీ కీలక సూచనలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రముఖ ఆలయాల వద్ద చర్యలు చేపట్టామన్నారు. ఏదైనా సాయం కోసం డయల్ 100 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
News February 11, 2026
ప్రకాశం: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని DEO రేణుక తెలిపారు.


