News May 25, 2024
తుఫాన్ ఎఫెక్ట్.. నెల్లూరులో చల్లబడ్డ వాతావరణం
నెల్లూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మిట్ట మధ్యాహ్నం మబ్బులు కమ్ముకున్నాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్‌లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 21, 2025
నెల్లూరులో ఇద్దరు సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు
నెల్లూరు జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను, నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసిన ఇద్దరు సర్పంచ్‌లపై కలెక్టర్ ఓ ఆనంద్ చర్యలు చేపట్టారు. కొడవలూరు మండలం పెమ్మారెడ్డి పాలెం పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గతంలో పనిచేసిన మధుసూదన్, రేగడిచెలిక పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్‌లను సస్పెండ్ చేశారు. రేగడిచెలిక, పెమ్మారెడ్డి పాలెం సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేశారు.
News January 21, 2025
జేఈఈ మెయిన్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే JEE మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. కోవూరు మండలం గంగవరంలోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్& టెక్నాలజీ, పొట్టేపాలెం ఇయాన్ డిజిటల్ జోన్, తిరుపతి జిల్లా కోటలోని NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలలో పరీక్షలు జరుగుతాయన్నారు.
News January 21, 2025
పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి: కమిషనర్
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని, బకాయిలు చెల్లించని వారి కనెక్షన్లను వెంటనే తొలగించాలని వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులను కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. కార్పోరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, టిడ్కో,హౌసింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు, అధికారులతో సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.