News October 29, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. సదాశివనగర్‌లో అత్యధికం

image

కామారెడ్డి జిల్లాలో మొంథా ప్రభావంతో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. సదాశివనగర్‌లో 30 మి.మీ వర్షపాతం నమోదు కాగా జుక్కల్‌లో 26.3, రామారెడ్డి 18, తాడ్వాయి 16.3, సోమూర్ 16, IDOC (కామారెడ్డి) 14.5, గాంధారి 13.8, నాగిరెడ్డి పేట 12.5, లింగంపేట 12.3, రామ లక్ష్మణపల్లి 9, పిట్లం 8.8, డోంగ్లి 8.3, పెద్ద కొడప్గల్ 7.3, సర్వాపూర్ 7మి.మీలుగా నమోదైంది.

Similar News

News October 29, 2025

వైఫల్యాలు విజయాలకు మెట్లు!

image

మీరు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని బాధపడుతున్నారా? విజయం పొందలేమని ఆందోళన చెందుతున్నారా? మీలానే సర్ జేమ్స్ డైసన్ అనుకుని తన ప్రయత్నాలను ఆపితే బ్యాగ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్‌ రూపొందేదా? ఆయన ఏకంగా 5,126 సార్లు విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన స్థాపించిన డైసన్ లిమిటెడ్ కంపెనీ వార్షికాదాయం ₹75,300 కోట్లు. వైఫల్యం అనేది ఆగిపోవడానికి సంకేతం కాదు.. ఇది విజయానికి మెట్టు అని గుర్తుంచుకోండి.

News October 29, 2025

రాచకొండ: AR కానిస్టేబుల్ చరణ్ మృతి

image

రాచకొండ ఏఆర్ కానిస్టేబుల్ V.చరణ్ కుమార్ (34)మృతి చెందారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిప్యూటేషన్‌లో ఉన్న ఆయన ఇటీవల ముంబై ఆపరేషన్‌ నుంచి తిరిగి వస్తూ గాయపడ్డారు. గాయం మానకపోవడంతో యశోద ఆసుపత్రిలో రెండుసార్లు చికిత్స చేయించుకున్నాడు. అనంతరం డిశ్చార్జ్ అయ్యిన కొద్ది సేపటికే ఇంట్లో మూర్ఛతో చనిపోయారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు యశోద ఆసుపత్రిలో ఆయనకు నివాళులర్పించారు. చరణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News October 29, 2025

జనగామకు ఆరెంజ్ అలర్ట్.. అప్రమత్తం చేసిన కలెక్టర్

image

జనగామ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను అప్రమత్తం చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదరపు కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.