News October 29, 2025
తుఫాన్ ఎఫెక్ట్: HYDలో BSP ధర్నా వాయిదా

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నవంబర్ 1న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి బీఎస్పీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మొంథా తుఫాన్ కారణంగా ధర్నా కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాంశేఖర్ తెలిపారు. తదుపరి ధర్నా తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Similar News
News October 29, 2025
NRPT: మాతృ మరణాలు తగ్గించాలంటూ కలెక్టర్ ఆదేశాలు

జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా పరిధిలో నమోదైన మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గర్భిణీలకు సమయానికి ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసును జాగ్రత్తగా పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు.
News October 29, 2025
NRPT: రైతులు స్లాట్ క్యాన్సల్ చేసుకోండి

నారాయణపేట జిల్లాలోని 2 జిన్నింగ్ మిల్లులలో అనగా 1 భాగ్యలక్ష్మి జిన్నింగ్ మిల్ లింగంపల్లి, 2 విజయ కాటన్ జిన్నింగ్ మిల్ తిప్రాస్ పల్లి తేదీ 30 నుంచి 31 వరకు సీసీఐ వారికీ పత్తి అమ్ముటకు స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్ క్యాన్సల్ చేసుకోవాలని మార్కెట్ అధికారులు కాన్సిల్ చేసుకోవాలని కోరారు. వర్షాలు కురుస్తున్నాయని సీసీఐ వారు కొనుగోలు చేయడం లేదన్నారు.
News October 29, 2025
ఆవు పాల అభిషేకంతో కష్టాల నుంచి విముక్తి

కార్తీక మాసంలో శివారాధన గొప్ప ఫలితాలనిస్తుందని మనకు తెలిసిందే. అందుకే చాలామంది శివాలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకాలు చేస్తుంటారు. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత పవిత్రమని పండితులు సూచిస్తున్నారు. ఈ అభిషేకం ద్వారా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘గోమాత పాలు శుభాలకు, పవిత్రతకు చిహ్నం. ఈ అభిషేకం వల్ల శివుడు సంతృప్తి చెంది, జీవితంలో సుఖశాంతులు నెలకొనేలా ఆశీర్వదిస్తాడు’ అంటున్నారు.


