News January 10, 2026
తుర్కపల్లి: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. ఆరుగురు అరెస్ట్

మాదాపూర్ గ్రామ శివారులో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్సై తక్యుద్దీన్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఒక హిటాచీ, కారు, పూజ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 14, 2026
కాళేశ్వరంలో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవార్లకు పూర్ణాభిషేకం నిర్వహించి, అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పాలపొరక, రక్షాబంధనం, దీక్షా వస్త్రధారణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఋత్విక్ వర్ణన, మృత్సం గ్రహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. క్షేత్రమంతా భక్తుల శివనామ స్మరణతో మారుమోగుతోంది. ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
News February 14, 2026
భూపాలపల్లి: 50 ఓట్ల లోపు ఆరుగురు విజయం

మున్సిపాలిటీలో 50 ఓట్ల లోపు మెజారిటీతో ఆరుగురు అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. 8వ వార్డు BRS అభ్యర్థి శ్యామల 18 ఓట్లు,13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ 21 ఓట్లు, 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బుర్ర కొమురయ్య 25 ఓట్లు, 28వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాధ 31ఓట్లు, 20 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాజునాయక్ 35 ఓట్లు, 24వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బండ రాజేశ్వరి 42 ఓట్లతో గెలుపొందారు.
News February 14, 2026
40 తర్వాత ఆహారంలో ఇవి చేర్చుకోండి

వయస్సు మీద పడుతున్న కొద్దీ కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. 40 ఏళ్లకు పైబడిన తరువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వస్తి చెప్పి ఆహారంలో టమాటాలు, చిలగడదుంపలు, కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, యాపిల్ పండ్లు, బాదం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అజీర్తి, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణలో ఉండి గుండెజబ్బులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.


