News April 4, 2025
తుర్కపల్లి: పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్

తుర్కపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన పంట పొలాలను కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలను తెలుసుకున్నారు. మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిలిందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ అధికారులను ఆయన ఆదేశించారు.
Similar News
News April 11, 2025
వాహనాలను తీసుకవెళ్లండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించాలని నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సీఆర్‌పీఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందజేయబడుతుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
News April 11, 2025
వేసవిలో వాకింగ్.. ఎప్పుడు చేయాలంటే..

వాకింగ్ అలవాటున్నవారికి వేసవిలో వేడిమి సమస్యగా ఉంటుంది. వారు ఆలస్యంగా లేచి వాకింగ్ చేయడం మంచిదికాదని జీవనశైలి నిపుణులు పేర్కొంటున్నారు. ‘సమ్మర్‌లో ఉదయం 7.30 గంటల్లోపు వాకింగ్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యుడి తీవ్రత పెరుగుతుంటుంది. అది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటాక, సాయంత్రం 5 గంటలలోపు ఆరుబయట వ్యాయామం, వాకింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు’ అని సూచిస్తున్నారు.
News April 11, 2025
వరంగల్ మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.