News February 17, 2025
తుర్కపల్లి: మోడల్ స్కూల్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్

మోడల్ స్కూల్ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శోభారాణి తెలిపారు. 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లిష్, 26న గణితం, 28, 29న సైన్స్, ఏప్రిల్ 2న సోషల్, ఏప్రిల్ 4న ఒకేషనల్ పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్స్ ఉంటాయన్నారు.
Similar News
News November 5, 2025
ఇతిహాసాలు క్విజ్ – 57

1. శబరి ఏ ఆశ్రమంలో రాముడి కోసం ఎదురుచూసింది?
2. విశ్వామిత్రుడి శిష్యులలో ‘శతానందుడు’ ఎవరి పుత్రుడు?
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ఏంటి?
4. నారదుడు ఏ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు?
5. కాలానికి అధిపతి ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 5, 2025
నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు

తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో 21 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ, NET, SLET, SET, MLISC, B.Ed, డిగ్రీ, ఇంటర్ , టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nsktu.ac.in
News November 5, 2025
గ్రేటర్ వరంగల్ వరద ముప్పు నివారణకు సమగ్ర ప్రణాళికలు

గ్రేటర్ వరంగల్‌ను వరద ముంపు ముప్పు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో జరిగిన సమీక్షలో నాలాలు, డ్రైన్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, రిటైనింగ్ వాల్స్ నిర్మాణంపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిపుణుల సలహాలతో పటిష్ఠ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.


