News March 14, 2025

తుళ్లూరు: పోలీసులతో పటిష్ట బందోబస్తు

image

వెంకటపాలెంలో రేపు జరగబోవు శ్రీవారి కల్యాణానికి వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. బంధువు పొత్తు నిర్వహణకు వీలుగా సభా ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌ఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.

Similar News

News March 15, 2025

తుళ్లూరు: పోలీసులతో పటిష్ట బందోబస్తు

image

వెంకటపాలెంలో నేడు జరగబోవు శ్రీవారి కల్యాణానికి వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. బంధువు పొత్తు నిర్వహణకు వీలుగా సభా ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌ఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.

News March 14, 2025

రేపటి నుంచి ఒంటిపూట బడులు: DEO

image

ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశించారు. ఉదయం 7.45 ని.ల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్ నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల తరగతులు పెట్టాలని చెప్పారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలన్నారు.

News March 14, 2025

గుంటూరు: 10th విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఈనెల 17 నుంచి 31వరకు పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుంటూరు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి రవికాంత్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ని కండక్టర్‌కి చూపించి తమ గ్రామాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చని చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఈ అవకాశం కల్పించామన్నారు. దీనిపై మీ కామెంట్.

error: Content is protected !!