News February 5, 2026
తూప్రాన్: ఎన్నికల బరిలో తోటి కోడలు

తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధి ఎన్నికల బరిలో తోటి కోడళ్లు పోటీ చేస్తున్నారు. ఒకరు తాజా మాజీ కౌన్సిలర్ కాగా, మరొకరు నూతనంగా ఎన్నికల బరిలో నిలిచారు. తూప్రాన్ మున్సిపల్ పరిధి 12వ వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఆమె తోటి కోడలు బొంది రజిని రాఘవేందర్ గౌడ్ 1వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె భర్త రాఘవేందర్ గౌడ్ ఇదే వార్డులో తాజా మాజీ కౌన్సిలర్‌గా ఉన్నారు.
Similar News
News February 7, 2026
మెదక్: మున్సిపల్ బరిలో న్యాయవాది

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో యువ న్యాయవాది జీవన్ రావు పోటీ చేస్తున్నారు. 2016లో లా పట్టా అందుకున్న జీవన్ రావు ప్రస్తుతం మెదక్ కోర్టులో ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 7వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రావు సతీమణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి 6వ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
News February 7, 2026
మెదక్: క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి: ఏఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు. ప్రతి పోలీసు రోజూ వ్యాయామం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. చట్టం అందరికీ సమానమని, చట్ట వ్యతిరేకులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు.
News February 6, 2026
మెదక్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందాడు. మేడ్చల్ జిల్లా కొనాయిపల్లికి చెందిన గుంటి నవీన్ కూచారంలో అంత్యక్రియలకు హాజరై బైక్‌పై వెళ్తున్నాడు. కాళ్లకల్ మైకో కంపెనీ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


