News January 13, 2026
తూప్రాన్: ఎమ్మెల్సీకి శుభాకాంక్ష లేఖలు అందజేత

ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డికి విద్యుత్ శాఖ తరపున ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గృహజ్యోతి, వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగదారులకు అందజేస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు లేఖలను మెదక్ విద్యుత్ శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ అందజేశారు. ఎమ్మెల్సీకి గృహజ్యోతి పథకం, వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం గురించి వివరించారు. డీఈ టెక్నికల్ విజయ శ్రీనివాస్, తూప్రాన్ ఏఈ వెంకటేశ్వర్లు, ఏఈ కమర్షియల్ రాజు పాల్గొన్నారు.
Similar News
News January 30, 2026
‘నర్సన్న రాయరావు’ పేరు మీదనే నర్సాపూర్

రాయరావు వంశానికి ఆద్యుడైన నర్సన్న రాయరావు పేరు మీదనే ఈ గ్రామానికి ‘నర్సాపూర్’ అనే పేరు వచ్చింది. గోల్కొండ సంస్థానంలో 16వ శతాబ్దంలో సేనాపతిగా, రాజకీయ సలహాదారుగా, అత్యున్నత పదవులు చేపట్టిన మొట్టమొదటిది నర్సన్న రాయరావు. ఆయన పరిపాలనలో ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడానికి నీటి సరఫరా కోసం నిర్మించిన చెరువే ఇప్పటి రాయరావు చెరువు. యుద్ధ, రాజకీయ వ్యూహాల్లో మంచి అనుభవం గడించిన రాయరావులలో నర్సన్న మొదటి వారు.
News January 30, 2026
మెదక్: వాహనదారులకు గుడ్ న్యూస్.. షోరూంలోనే రిజిస్ట్రేషన్

ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని మెదక్ జిల్లా రవాణా శాఖాధికారి వెంకటస్వామి తెలిపారు. కార్లు, ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను షోరూంలోనే పూర్తి చేసుకునే కొత్త విధానం ఈ నెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా అమల్లోకి వచ్చిందన్నారు. మెదక్‌లోని ఓ షోరూంలో ఈ సేవలను ఆయన అధికారికంగా ప్రారంభించారు. సమయం ఆదా చేసే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News January 30, 2026
మెదక్ జిల్లాలో రెండో రోజు 256 నామినేషన్లు

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రెండో రోజు నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. మొత్తం 269 మంది అభ్యర్థులు 286 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్‌లో 111, నర్సాపూర్‌లో 55, రామాయంపేటలో 52, తూప్రాన్‌లో 51 నామినేషన్లు అందాయి. పార్టీల వారీగా కాంగ్రెస్ 106, బీఆర్ఎస్ 96, బీజేపీ 51 చొప్పున పత్రాలు సమర్పించారు. నేడు స్వీకరణకు చివరి రోజు కావడంతో నామినేషన్ల భారీగా రానున్నాయని అధికారులు తెలిపారు.


