News December 7, 2025
తూప్రాన్: ‘కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇయ్యండి’

పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇవ్వండి అంటూ ఓ అభ్యర్థి కాళ్లు పట్టి వేడుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి తూప్రాన్ ఐడీఓసీ భవనంలో గుర్తుల కేటాయింపు సమయంలో చోటుచేసుకుంది. ఇస్లాంపూర్(తూప్రాన్) సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు. బీఆర్ఎస్‌లో చేరిన స్వతంత్ర అభ్యర్ధి బీములు కాంగ్రెస్ నాయకుడి కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు.
Similar News
News February 17, 2026
సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈనెల 19న మెదక్, 20న నర్సాపూర్‌లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో బంజారా సంఘం నాయకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ నగేష్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ పాల్గొన్నారు. వేడుకల విజయవంతానికి పలు సూచనలు చేశారు.
News February 17, 2026
జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల్లో మెదక్ జిల్లా అధికారి

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ న్యూఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ తరఫున మెదక్ జిల్లా నుంచి తూప్రాన్ ఎంపీడీవో నూతికట్టు సతీష్ జాతీయ స్థాయి క్యారమ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. పురుషులు, మహిళల విభాగాలకు చెందిన 16 మంది సభ్యుల బృందానికి ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న సతీష్‌ను పలువురు అధికారులు అభినందించారు.
News February 17, 2026
MDK: భార్య ఛైర్‌పర్సన్.. భర్త కౌన్సిలర్!

రామాయంపేట మున్సిపాలిటీలో భార్య భర్తలు మున్సిపాలిటీలో అడుగు పెట్టారు. భార్య గజవాడ లావణ్య ఒకటో వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. భర్త నాగరాజు ఏడవ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది మున్సిపాలిటీలో రెండవసారి అడుగుపెట్టారు. భార్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఛైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భార్య ఛైర్ పర్సన్, భర్త కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.


