News March 31, 2025
తూప్రాన్: గ్రూపు-1లో 17వ ర్యాంకు

తూప్రాన్ పట్టణానికి చెందిన బోయినిపల్లి ప్రణయ సాయి ఆదివారం ప్రకటించిన ర్యాంకుల్లో గ్రూపు -1లో 513 మార్కులతో రాష్ట్రస్థాయి 17వ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విష్ణువర్ధన్, శ్రీవిద్య దంపతుల కుమారుడైన ప్రణయ్ సాయి గ్రూపు-lV ఫలితాల్లో 42 ర్యాంకు సాధించి చేగుంట రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్ -llలో 134, గ్రూపు -lllలో 148 ర్యాంకు సాధించాడు.
Similar News
News April 2, 2025
ఏప్రిల్2: చరిత్రలో ఈరోజు

1915: తెలుగు సినిమా నటుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం
1969: నటుడు అజయ్ దేవగన్ జననం
1981: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ జననం
1872: టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త శామ్యూల్ F.B మోర్స్ మరణం
1933: భారత మాజీ క్రికెటర్ రంజిత్ సిన్హ్‌జీ మరణం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం
News April 2, 2025
భదాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యుల నియామకం

భద్రాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులుగా ప్రముఖ సీనియర్ న్యాయవాదులు లక్కినేని సత్యనారాయణ, అనుబ్రోలు రాంప్రసాద్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు జారీ చేసిన G.O. No.198 ప్రకారం వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ నియామకం ద్వారా న్యాయ సేవాధికార సంస్థ మరింత బలోపేతం అవుతుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
News April 2, 2025
గద్వాల జిల్లా పోలీసుల సీరియస్ WARNING

గతంలో ఎప్పుడో జరిగినా వివాదాలు పరిష్కారమై, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో తిరిగి వాటికి సంబంధించిన వీడియోలను మళ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల సీఐ శ్రీను హెచ్చరించారు. కావాలని పాత విభేదాలు కలిగి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో మళ్లీ పోస్టు చేసే వారిపై, ఫేక్ న్యూస్‌ను వైరల్ చేసే వారిపై జిల్లా పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టిందని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.