News March 17, 2025

తూప్రాన్: తల్లిదండ్రులు మృతి చెందారని.. కొడుకు ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన చింతల రాజు (24) తండ్రి బాల నరసయ్య ఏడాది క్రితం మరణించగా, పది రోజుల క్రితం తల్లి పోచమ్మ మృతి చెందింది. మృతి చెందినప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. 12న తల్లి దశదినకర్మ జరిపి, రాత్రి పురుగుల మందు సేవించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు

Similar News

News July 7, 2025

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈగా నారాయణ నాయక్

image

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)గా నారాయణ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహించిన శంకర్ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న నారాయణ నాయక్ నియమితులయ్యారు.

News July 7, 2025

మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 61 దరఖాస్తులు

image

ప్రజావాణి కార్యక్రమానికి 61 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం తెలిపారు. మెదక్‌లో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు-29, పింఛన్లు-4, ఇందిరమ్మ ఇళ్లు-7, ఇతర సమస్యలకు సంబంధించి 21 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2025

మెదక్: ‘రైతులను ఆదుకోవాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు రైతు సమస్యలపై రైతు రక్షణ సమితి సభ్యులు వినతిపత్రం అందించారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.